మాజీ భార్యే సవతి తల్లి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Monday, 5 July 2021

మాజీ భార్యే సవతి తల్లి !


ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ జిల్లాలో  కొడుకు నుంచి విడాకులు తీసుకున్న భార్య  తండ్రిని పెళ్లి చేసుకుంది. అప్పటివరకు తన భార్యగా ఉన్న ఆమె, ఇప్పుడు సవతి తల్లి అయ్యింది.  2016లో సంబంధిత ఒక వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహమైంది. అప్పటికి వారిద్దరూ మైనర్లే. కాగా 6 నెలల తర్వాత అభిప్రాయ బేధాలు వచ్చి వారిద్దరూ విడిపోయారు. ఆమెతో తిరిగి కలిసి జీవించేందుకు అతను ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అతనొక తాగుబోతని, తనకు విముక్తి కావాలని చెప్పి ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి అతని తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తన తండ్రి వివరాలు సేకరించాలని ఆర్​టీఐ దాఖలు చేశాడు.  ఆ 48 ఏళ్ల తండ్రి,  కొన్నేళ్ల క్రితం కొడుకు పెళ్లిచేసుకున్న అమ్మాయిని తిరిగి వివాహమాడి, సంభాల్​ ప్రాంతంలో కలిసి జీవితం సాగిస్తున్నాడని తెలిసి ఆ కొడుకు షాక్‌కు గురయ్యాడు.  అనంతరం బిసౌలీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు వారిద్దరిని పిలిచి మాట్లాడారు. మహిళా మాత్రం  రెండో భర్తతోనే సుఖంగా ఉన్నట్టు తెలిపింది. మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని పోలీసులకు  తెలియజేసింది.

No comments:

Post a Comment

Post Top Ad