బ్రిటన్ ఆరోగ్యమంత్రికి కరోనా

Telugu Lo Computer
0


 బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్‌కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన రెండు డోసులు వ్యాక్సిన్ వేయించు కున్నారు. అయినా ఆయనకు కరోనా పాజిటివ్ రావటం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సాజిద్ సూచించారు. అయితే శుక్రవారం మంత్రి సాజిద్​ జావిద్​ తో సమావేశమయ్యారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. ఈ క్రమంలో టెస్ట్​ అండ్​ ట్రేస్​ ఫోన్​ యాప్​ ద్వారా ప్రధానిని అలర్ట్​ చేసినట్లు 10 డౌనింగ్​ స్ట్రీట్​ కార్యాలయం తెలిపింది. మొబైల్​ యాప్​ ద్వారా అలర్ట్​ చేసిన వ్యక్తులు 10 రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. అయితే బోరిస్​ జాన్సన్​ మాత్రం స్వీయ నిర్బంధంలోకి వెళ్లేందుకు నిరాకరించారు. బోరిస్ జాన్సన్ ఐసోలేషన్​కు వెళ్లకుండా.. ప్రత్యేక పని ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న ప్రత్యామ్నాయ విధానంలో ప్రతి రోజూ కరోనా టెస్ట్ చేసుకుంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆర్థిక మంత్రి రిషి సునక్​ కు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ఆయన కూడా జావిద్ ​తో సమావేశమయ్యారు. వారిద్దరూ తప్పనిసరి కార్యకలాపాల్లోనే పాల్గొంటారని ప్రభుత్వం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)