రైల్వే కార్యాలయాలు ఇక అర్ధరాత్రి వరకు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 9 July 2021

రైల్వే కార్యాలయాలు ఇక అర్ధరాత్రి వరకు !


రైల్వే శాఖ కార్యాలయాలలోని ఉద్యోగుల పని వేళలను రైల్వే మంత్రిత్వ శాఖ రెండుగా విభజించించిన నేపథ్యంలో  తొలి షిఫ్ట్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. రెండవ షిఫ్టు..మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. ఇకనుండి  ఢిల్లీలోని రైల్వేశాఖ కార్యాలయం ఉదయం 7 గంటలకే తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఉద్యోగులందరూ 7 గంటలకే కార్యాలయానికి చేరుకుంటారు.  అర్ధరాత్రి 12 గంటల వరకు విధి నిర్వహణలో ఉంటారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రజా వ్యవహారాలు) డీజే నారాయణ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.  కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకొని  రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్ తొలిరోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రైల్వే శాఖ కార్యాలయంలోని అధికారులు మరియు సిబ్బంది రెండు షిఫ్ట్ లలో పనిచేయాలని రైల్వే మంత్రి ఆదేశించారు.

No comments:

Post a Comment

Post Top Ad