ప్రధాన న్యాయమూర్తి చొరవ

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టులో బుధవారం అరుదైన ఘట్టం ఆవిష్కతృమయింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తన మాతృభాష తెలుగులో వాదనలు విని ఒక జంట విడిపోకుండా ఒక్కటి చేయడానికి ప్రయత్నించారు. సాధారణంగా సుప్రీంకోర్టులో వాదనలన్నీ ఇంగ్లీష్‌లోనే జరుగుతుంటాయి. అయితే బుధవారం 18 ఏళ్ల క్రితం కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితురాలు ఇంగ్లీష్‌లో సమర్థవంతంగా తన బాధను చెప్పుకోవడంలో తడబడ్డారు. దీంతో జస్టిస్‌ రమణ ఆమె బాధను తెలుగులో విన్నారు. ఈ కేసు వివరాల ప్రకారం గురజాల డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాసశర్మ, శాంతిలకు 1998లో వివాహం జరిగింది. వీరికి 1999లో ఒక కుమారుడు జన్మించాడు. ఇంట్లో గొడవల కారణంగా 2001 నుంచి విడిపోయారు. అయితే తనపైన దాడి చేశారంటూ శాంతి పోలీసులను ఆశ్రయించారు. దీంతో శ్రీనివాసశర్మపై సెక్షన్‌ 498ఏ కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత గుంటూరులోని 6వ అడిషనల్‌ మున్సిప్‌ మెజిస్టేట్‌ కోర్టు శ్రీనివాసశర్మకు ఏడాది జైలుశిక్ష, రూ.1000 ఫైన్‌ విధించింది. అయితే శ్రీనివాసశర్మ హైకోర్టును ఆశ్రయించడంతో 2010 అక్టోబర్‌ 6వ తేదీన శిక్ష తగ్గిస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు తీర్పును శాంతి సుప్రీంకోర్టులో 2011లో సవాలు చేసింది. బుధవారం కేసు విచారణ జరిగింది. సుదీర్ఘకాలంగా దూరంగా ఉన్న భార్యాభర్తల మనోగతాన్ని స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. విచారణను సహచర న్యాయమూర్తి సూర్యకాంతకు ఇంగ్లీషులో ఎన్వీరమణ వివరించడం విశేషం

Post a Comment

0Comments

Post a Comment (0)