డ్రైవింగ్ లైసెన్స్ ఇక ప్రైవేటు పరం !

Telugu Lo Computer
0


ఇకపై ఆర్టీఏ డ్రైవింగ్‌ కేంద్రాలు అలంకారప్రాయం కానున్నాయి.  డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళనున్నాయి. కేవలం సర్టిఫికేషన్ కోసం మాత్రమే ఆర్టీఓకు వెళ్లాల్సి వస్తుంది.  ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్‌లలో ఆటోమొబైల్‌ సంస్థల భాగస్వామ్యం పెరిగినట్లుగానే డ్రైవింగ్‌లో శిక్షణ, నైపుణ్య పరీక్షలు సైతం ప్రైవేట్‌ సంస్థలే నిర్వహించనున్నాయి. ఈ దిశగా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ సన్నాహాలు చేపట్టింది. కేంద్రం కొత్తగా రూపొందించిన 'అక్రెడిటెడ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌' స్కీం అమలుకు రవాణాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

దీని  ప్రకారం  డ్రైవింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలంటే రెండెకరాల భూమి, లేటెస్ట్ ట్రైనింగ్ సెంటర్, తేలికపాటి, భారీ వాహనాలు తదితర మౌలిక సదుపాయాలు కలిగిన సంస్థలు లేదా వ్యక్తులు కొత్త అక్రిడేటెడ్‌ ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంస్థలిచ్చే శిక్షణను ఆర్టీఏ అధికారులు ప్రామాణికంగా భావించి డ్రైవింగ్‌ లైసెన్సులను జారీ చేస్తారు. ఒకసారి అక్రెడిటెడ్‌ డ్రైవింగ్‌ స్కూల్లో శిక్షణ కోసం చేరితే నెల రోజులు ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు ఈ స్కూళ్లే ఫారమ్‌-5 సర్టిఫికేషన్ ఇస్తాయి. దానిని బట్టే రవాణా అధికారులకు డ్రైవింగ్‌ లెసెన్సులు మంజూరు చేస్తారు. డ్రైవింగ్‌ కేంద్రాల నుంచి ఆర్టీఏ కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో డేటా చేరుతుంది. వీలైనంత వరకు అభ్యర్థులు ఆర్టీఏకు వెళ్లకుండానే లైసెన్సులు చేతికొచ్చేస్తాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)