రీచార్జీల మోత...!

Telugu Lo Computer
0


మొబైల్‌ నెట్‌వర్క్‌ల మధ్య పోటీతత్వం కారణంగా తక్కువ ధరలకే లభిస్తున్న ప్లాన్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్న వినియోగదారులకు కొన్ని సంస్థలు షాక్ ఇవ్వబోతున్నాయి. త్వరలోనే కనీసం 30శాతం చార్జీలు పెంచబోతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు తమ టారిఫ్‌లను మార్చబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ ప్యాకేజీల్లో బేసిక్‌ లెవెల్‌గా ఉన్న 49 రూపాయల ప్లాన్‌ను తొలగించి, దాని స్థానంలో 79 రూపాయల ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అంటే ఎంట్రీ లెవెల్‌ ప్లాన్‌ను దాదాపు 60 శాతం పెంచేసింది.వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌ కూడా ఎయిర్‌టెల్‌ రూట్లోనే వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే కొత్త ప్లాన్‌లు అమలు చేస్తున్న వొడాఫోన్ ఐడియా.. త్వరలోనే దేశమంతా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎంట్రీ లెవెల్‌ ప్లాన్‌లను ఎక్కువ మొత్తానికి పెంచేయనుంది. ప్రస్తుతానికి మొబైల్‌ వినియోగదారుల్లో 90 శాతం మంది ప్రీపెయిడ్‌ వాడే వారే ఉన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్లాన్స్‌ వల్ల ఆర్థిక భారం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంలో టెలికాం సంస్థలు ఉన్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్‌ ప్లాన్లతో పాటు మరికొన్నింటిని పెంచేందుకు టెలికాం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)