సీఎంగా బొమ్మై ప్రమాణ స్వీకారం

Telugu Lo Computer
0


బసవరాజ్‌ బొమ్మై చేత కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ప్రమాణ స్వీకారం చేయించారు. బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు.  శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును యడియూరప్ప ప్రతిపాదించగా మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ ఆమోదం తెలిపారు. మంగళవారం వరకు దాదాపు పది మంది ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరకు ఈ పేరును అధిష్ఠానం ఖరారుచేసింది. ఇదే సందర్భంగా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్‌.అశోక్‌, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఈ పదవులకు ఎంపికయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)