మధుర గీతం !

Telugu Lo Computer
0

ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి

జడను చుట్టి
హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా..
చిట్టెమ్మా..
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా..
చెప్పమ్మా..
ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
వయసు ఉంది..
ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా
కిట్టయ్యా..
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చెప్పయ్యా..
అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చరణం 1:
పుట్టింటి అరణాలూ..ఊ.. ఘనమైన కట్నాలూ..ఊ..హోయ్.. ఓ..
పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు.. అత్తవారి ఇంటినిండా వేసినా
అవి అభిమానమంత విలువ జేతునా..ఆ.. అభిమానమంత విలువ జేతునా
ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అభిమానం ఆభరణం మర్యాదే భూషణం.. గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనం చెప్పుకోను వీలయా.. గొప్పతనం చెప్పుకోను వీలయా
అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చరణం 2:
కాలు చేయి లోపమనీ..ఈ.. కొక్కిరాయి రూపమనీ..ఈ..
కాలు చేయి లోపమని కొక్కిరాయి రూపమని.. వదినలు నన్ను గేలిచేతురా
పిల్లని తెచ్చి పెళ్ళిజేతురా..ఆ.. పిల్లని తెచ్చి పెళ్ళి జేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి..
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి.. నవ్విన నాప చేనే పండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా..ఆ.. నలుగురు మెచ్చు రోజు ఉండదా
అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా...
సాహిత్యం .... కొసరాజు

Post a Comment

0Comments

Post a Comment (0)