ఈపీఎఫ్ నెంబర్ జనరేట్ చేయడం ఎలా..?

Telugu Lo Computer
0



ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) ను జారీ చేస్తుంది. యూఏఎన్ నెంబర్‌ను శాలరీ స్లిప్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ మీ శాలరీ స్లిప్ మీద యూఏఎన్ నెంబర్ లేకపోతే ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. యుఎఎన్ జనరేట్ చేయడానికి ముందు మీ ఆధార్ మొబైల్ నెంబరుతో మొదట లింకు అవ్వాలి. ఎందుకంటే మీ ఆధార్ తో లింకు చేసిన మొబైల్ నెంబర్ కు ఒక సందేశం వస్తుంది. యుఏఎన్ జనరేట్ లేదా యాక్టివేట్ చేసేటప్పుడు మీరు ఆధార్ కార్డు నెంబరును దగ్గర ఉంచుకోవాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)