మలిసంధ్య - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 9 July 2021

మలిసంధ్య


పెరిగిన వయసు గొప్పతనం ఏమిటంటే, మనం ముందుకు దాటుకుంటూ వెళ్ళిపోయినా, వయసు అనే ఆ నంబర్లు ఎప్పుడూ మనతోనే ఉంటాయి.. ఒక ఎదుగుదలలా.. అనుభవంలా.. సాధించుకున్న కుటుంబంలా.. వాటితో వచ్చే ప్రేమల్లా ఆప్యాయతల్లా..

మనసు మన అధీనంలో ఉన్నంతకాలం వయసు అనే సంఖ్య పెరగొచ్చేమో కానీ దానివల్ల వృద్ధాప్యం చెందామన్న ఆలోచన కానీ.. ఆ అవసరం కానీ రాలేదు.. రాదు కూడా.. ఇప్పుడున్న కాలంలో వృద్ధాప్యం అన్నది వయసుతో పనిలేకుండా అందరికీ వర్తిస్తోంది ముఖ్యంగా నెగిటివిటీ ఆలోచన మోస్తున్నవారికి..
ఇక ముడతలు పడే చర్మం విలువ ఎందరికి తెలుసు!!.. ఆ గీతల్లో పెద్దవారని ఎంతో మర్యాద ఇచ్చే గౌరవం ఉంది .. ఆ ముడుతలే మనం జీవితంలో ఎంత పరిణితి చెందామో చెబుతాయి.. మన తెలినితేటలను అందరూ గుర్తించేలా అలాగే మనం నడిచిన త్రోవలో ఇతరులు నడవడానికి దోహద పడతాయి.. అవే ముడతలు మనల్ని మనం బాగా అర్థంచేసుకున్నట్లు అనిపించేలా చేస్తాయి.. మనకెన్నో నేర్పించి మన మీద మనకెంతో సంతృప్తిని ఇచ్చి మనకెన్నో అనుభవాలను నేర్పించిన ఆ వయసు వద్దని అనగలమా..!!
ప్రతి ఒక్కరికీ వయసు పెరుగుతుంది.. అలా పెరిన వయసుతో పాటు మనశ్శాంతితో ఉంటూ నలుగురు వ్యక్తులకు అర్ధమయ్యే విషయాలను చెబుతూ మనకు అనవసరమైన విషయాల పట్ల ఆశ వ్యామోహాలు తగ్గిస్తూ మనసును స్తిమితంగా శరీరాన్ని నిలకడగా నిలబెట్టుకుని జీవిస్తే అందులో పొందగలిగే ఆనందం అలవికానిది..
మీదపడే వయస్సును స్వాగతిస్తూ ప్రేమిస్తూ సాగిపోవడం ఒక అత్యుత్తమమైన భావన.. అప్పటివరకూ జీవితంలో ఎన్నో దశల్లో ఎన్నో చూసి నేర్చుకున్నట్టు ప్రస్తుతం ఉన్న దశ కూడా ఏం నేర్పిస్తే అది నేర్చేసుకోవఢమే.. పెరిగిన వయసు చెక్కిన శిల్పం లాంటిది.. జీవితమనే పాఠంతో అందంగా చెక్కబడి ఉంటుంది..
కొందరు పెద్దవారమౌతున్నామని ఎందుకో బాధపడతారు.. ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ అదే ఆలోచనలతో మూడీగా ఉంటారు.. అసలు దేని గురించి బాధపడాలి? జీవితాన్ని వయసుతో కాక మనసుతో కొలవాలి.. మనం పుట్టిన రోజు, చోటు మార్చలేం కానీ మనసును ఉల్లాసంగా ఉంచి సంతోషంగా జీవించే వేర్పు మార్పు మన చేతుల్లోనే ఉంది.
సంతోషాలన్నవి మనచుట్టూ ఎన్నో ఉన్నాయి.. చూసే చూపు ఆస్వాదించే మనసు ఉంటే వయసు తన లెక్కలు తానే మరిచిపోతుంది..
పరిపూర్ణమైన కుటుంబ జీవితం గడిపి పిల్లల బాధ్యత నిర్వర్తించి వారు ప్రయోజకులైన రోజు మన మనసు కూడా వారితో సమానంగా ఆనందించదా? ఇక అక్కడ వయసుకు తేడా ఎక్కడుంది.. ఎవరు పిల్లలు ఎవరు పెద్దలు..
వయసు పెరగడం అన్నది ఒక ప్రక్రియ.. అలా పెరిగే వయసు యొక్క అందం ఎప్పుడైనా గమనించారా? మన ముఖంపై నాట్యమాడుతున్నట్టు కనిపిస్తుంది.. అది పెరిగిన వయసు మనకిచ్చే కాన్ఫిడెన్స్.. అదే కాన్ఫిడెన్స్ కోల్పోక జీవిస్తే పెరిగే వయసును మానసికంగా ఆపే శక్తి మనసుకుంది.. పెరిగే వయసును నిజాయితీగా ప్రేమించండి..
మన ఆలోచన ఒక ఇమ్యూనిటీ బూస్టర్.. వయసు పెరుగుతోందని బాధపడి శరీరాన్ని బాధపెట్టకండి.. కొత్త విషయాలు నేర్చుకొంటూ ఎప్పుడూ స్టూడెంట్ మైండ్ సెట్ తో జీనిస్తే అదో గొప్ప నిర్వచనం.. చిన్నప్పటి నుండి నడిచిన దారుల్లో నేర్చుకుని నేర్పించిన పాఠాల్లో మనం సాధించిన గుర్తింపు మనల్ని మరింత చిన్నవాళ్ళని చేస్తుంది..
గడిచిపోయిన కాలాన్ని లెక్కించకుండా వృద్ధాప్యం అంటే ఏమిటో మాకు ఎప్పటికీ తెలియదని అనుకంటే ప్రతిరోజూ తెచ్చే ఆనందం ముందు గడిచిన సమయం విలువ ఎంత.. ఆ వయసు విలువ ఇంకెంత..
eat soul food & live young soul అని ఎక్కడో చదివిన గుర్తు.. ప్రకృతిలో జీవిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే మీరు యవ్వనంగా ఉన్నట్టే.. దూకుడుగా ఉత్సాహంగా ఉంటూ వృద్ధాప్యాన్ని భయపెట్టండి.. అది మీ జోలికి రాదు..

No comments:

Post a Comment

Post Top Ad