రాంకీ సంస్థపై ఐటీ దాడులు

Telugu Lo Computer
0


వైసిపి రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థపై ఐటీ అధికారులు  దాడి చేశారు. గచ్చిబౌలిలోని రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణలోని రాంకీ అనుబంధ సంస్థల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నారు. మొత్తం 15 ఐటీ బృందాలు వైసిపి ఎంపీకి సంబంధించిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. సెబీ ఇచ్చిన సమాచారంతో 20 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రాంకీ టవర్స్‌లో 20 ఐటీ బృందాలు విస్తృత సోదాలు చేస్తోంది. ఊహించని రీతిలో పెరిగిన రాంకీ షేర్స్‌పైనా సెబీ నిఘా పెట్టింది. కంపెనీలో జరుగుతున్న పరిణామాలపై సెబీ అంతర్గత విచారణ చేపట్టింది. రాంకీ షేర్స్ విలువ పెరగడంపై రాంకీ సంస్థకి సెబీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మలేషియాకు చెందిన కంపెనీకి రాంకీ సంస్థ నిధులు మళ్లించినట్లుగా ఐటీ అనుమానం వ్యక్తం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)