గోల్కొండలో బోనాలు షురూ !

Telugu Lo Computer
0


గతేడాది కరోనా కారణంగా ఊరేగింపు, డప్పు వాయిద్యాలు, బ్యాండు మేళాలు, పోతురాజుల నృత్యాలు లేకుండా బోనాల పండగ ఉత్సవాలను నిర్వహించారు. కానీ ఈసారి కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో మళ్లీ డప్పు వాయిద్యాలు, బ్యాండు మేళాలు, పోతురాజుల నృత్యాల మధ్య బోనాల పండుగ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి. జగదాంబికా అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. గోల్కొండ బోనాలతో హైదరాబాద్‌లో ఉత్సవాలు మొదలై 9 వారాల పాటు జరుగనున్నాయి. రాబోయే వారం లష్కర్‌లో  బోనాల పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాత లాల్‌ దర్వాజా, ధూళ్‌పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటారు. నగరాల్లో ముగిసిన తర్వాత జిల్లాల్లోనూ ఈ బోనాల పండుగను జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. తెలంగాణలో బోనాలు ఉత్సవాలు గోల్కొండ కోటలో ప్రారంభమై, తిరిగి ఇక్కడే ముగుస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)