ఒకరి నుంచి 88 మందికి కరోనా ?

Telugu Lo Computer
0


కరోనా  రెండో దశలో చూసిన అత్యంత భయానక దృశ్యాలు మర్చిపోయారు. ఒక్కసారి కేసులు తగ్గగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్​నాట్ విలువను గమనిస్తే.. థర్డ్​వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో కొవిడ్‌ తొలి దశ మందగించాక, అన్ని ఆర్థిక కార్యకలాపాలు మొదలు పెట్టాం. అదే సమయంలో ప్రజలు కొవిడ్‌  ప్రొటోకాల్‌ను గాలికొదిలేశారు. ఫలితంగా ఉప్పెనలా సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడి లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అంత భయంకరమైన పరిస్థితులు చూసినా జనాల్లో మార్పు రాలేదు. ఒక్కసారి కేసులు తగ్గగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దేశంలో 60 శాతం జనాభాకు టీకాలు అందకముందే మార్కెట్ల వంటి చోట్ల నిబంధనలు ఎవరూ పాటించడంలేదు. ఫలితంగా కేసులు మెల్లగా పెరగటం మొదలైంది. ఆర్‌నాట్‌ విలువను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మే 15వ తేదీ నుంచి జూన్‌ 26వ తేదీ మధ్య ఆర్‌నాట్‌ విలువ 0.78 నుంచి 0.88కు పెరిగింది. ఫలితంగా యాక్టివ్‌ కేసుల సంఖ్యలో తగ్గుదల నిలిచిపోయింది. ఈ విషయాన్ని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటికల్‌ సైన్సెస్‌ పేర్కొంది. ఒక్కసారి సెకండ్‌వేవ్‌ ముందు పరిస్థితులను గమనిస్తే.. ఫిబ్రవరి 15వ తేదీన దాదాపు 9వేలకు కేసులు తగ్గాయి. గతేడాది జూన్‌లో ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. కానీ, ఆ తర్వాత నుంచి స్వల్పంగా పెరగటం మొదలై మే మొదటి వారం చివర్లో రోజుకు 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా జులై 5వ తేదీన 34వేలకు కేసుల సంఖ్య తగ్గింది. కానీ, ఆ తర్వాతి రోజు నుంచి మెల్లగా పెరగటం మొదలై ఇప్పుడు మళ్లీ నిత్యం 40 వేల పైచిలుకు కేసులు వస్తున్నాయి. తాజాగా ఆర్‌నాట్‌ విలువ 0.78 నుంచి 0.88కు పెరగటాన్ని విశ్లేషిస్తే.. 100 మంది కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల నుంచి వ్యాధి మే 15 నాటి విలువ ప్రకారం 78 మందికి సోకింది. కానీ, జూన్‌ 26కు వచ్చేసరికి వ్యాధి 88 మందికి సోకుతున్నట్లు గుర్తించారు. ఆర్‌నాట్‌ విలువ 1 దాటిందంటే.. వ్యాధి వ్యాప్తిరేటు శరవేగంగా పుంజుకుంటుంది

Post a Comment

0Comments

Post a Comment (0)