ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే....!

Telugu Lo Computer
0

 


రాజస్థాన్‌ లోని ఆ కలియుగు కుంభకర్ణుడు పేరు పుర్ఖారామ్. వయస్సు 42. అరుదైన అతినిద్ర వ్యాధి (హెచ్‌పీఏ యాక్సిస్‌ హైపర్‌సోమ్నియా)తో బాధపడుతూ 19 ఏళ్ల వయసు అదే పరిస్థితి. నెలకు 5 నుంచి 7 రోజుల పాటు ఏకధాటిగా నిద్రపోయేవాడటం. కానీ ఇప్పుడు అది మరీ పెరిగిపోయింది. నెలలో 20 నుంచి 25 రోజుల నిద్రలోనే ఉంటున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..పుర్ఖారామ్ కు ఓ షాపు ఉంది. మరి అన్ని రోజులు నిద్రపోతుంటే ఇక షాపు ఎలా తెరుస్తాడు? సరుకులు ఎలా అమ్ముతాడు? అనే డౌట్ వస్తుంది. అందుకే పుర్ఖారామ్ షాపును నెలలో ఐదు రోజులు మాత్రమే తెరుస్తాడు. మిగతా 25 రోజులు ఆ షాపు మూసే ఉంటుంది. ఈ కుంభకర్ణుడితో భార్య లిచ్మిదేవి తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అలా వారాల తరబడి నిద్రపోతున్న భర్తకు అన్నీ ఆమే అయి చూసుకుంటుంది. ఒకసారి పడుకుంటే ఏకధాటిగా 25 రోజులపాటు మంచానికే అతుక్కుపోతున్న భర్త అప్పుడప్పుడు మధ్యలో మేలుకుంటాడు. ఆ సమయం కోసం కనిపెట్టుకుని ఆమె భర్తకు గబగబా స్నానం చేయించేస్తుంది. ఆహారం పెట్టేస్తుంది. కాలకృత్యాలు వంటివి చేయించేస్తుంది. అన్నీ గబగబా చేసేస్తుందామె.ఎందుకంటే ఎప్పుడు తిరిగి నిద్రలోకి జారుకుంటాడో తెలీయక. అలా నిద్ర మధ్యలో లేచినప్పుడు తలనొప్పిగా ఉందని బాధ పడుతుండాడని చెప్పింది. అతి నిద్ర కారణంగా పుర్ఖారామ్‌ను స్థానికులు కుంభకర్ణుడు అని పిలవడం మొదలుపెట్టారని ఆమె వాపోయింది. పుర్ఖారామ్ పరిస్థితిని తెలుసుకున్న సైంటిస్టులు మెదడులోని టీఎన్‌ఎఫ్‌-ఆల్ఫా ప్రొటీన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గుల వల్లే ఇలా అతినిద్ర పోతుంటారని చెబుతున్నారు. కాగా పుర్ఖారామ్ తల్లి కన్వారి దేవి కొడుకు పరిస్థితిని చూసి బాధపడుతుంటుంది. ఎప్పటికైనా కొడుకు అందరిలా ఉంటాడని ఆ నిద్ర సమస్యనుంచి కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)