21 లక్షల బెడ్ రోల్స్ మాయం !

Telugu Lo Computer
0


రైల్లో ఏసీ ప్రయాణీకులకు బెడ్ రోల్ ఇస్తారు అది తెలిసిందే. ప్రయాణం పూర్తయిన తర్వాత అవి మనం అక్కడే వదలి రావాలి. కానీ కొందరు ప్రయాణీకులు "ప్రభుత్వ ఆస్థి ప్రజల ఆస్తి" అనే విషయాన్ని అక్షరాల నమ్మినట్టున్నారు. వెళ్ళేటప్పుడు ఇంటికి పట్టుకెళతారట (దొంగతనం చేసి తీసుకెళతారు). ఈ ఒక్క సంవత్సరంలొనే 21 లక్షల బెడ్ రోల్ ఐటమ్స్ తీసుకెళ్లారట.

ఈ విషయమై 5-6 సం ముందు బెడ్ రోల్ అసిస్టెంట్ ని ఆరాతీశాను. అతను చెప్పిన విషయాలు నన్ను ఆశ్చర్యపరచాయి అనడంకంటే బాగా డిస్టర్బ్ చేసాయి అనాలి.
1) ప్రయాణీకులు హాండ్ టవల్ మాత్రమే కాక బెడ్ షీట్లు, కంబళ్లు కూడా తీసుకెళతారట.
2) 3rd ఏసీ కంటే ఎక్కువ దొంగతనం 2nd ఏసీలో జరుగుతుందనడంతో నేను నోరెళ్లబెట్టాను. 2nd ఏసీలో మామూలుగా బాగా డబ్బున్న వాళ్ళు, పై అధికారులు ప్రయాణిస్తారు...
3) ప్రతి హాండ్ టవల్ కి 50 రూపాయలు, బెడ్ షీట్ కు 250 రూపాయలు, కంబలికి 750 రూపాయలు మా జీతంలో కట్ చేస్తారు సార్.
4) మాకు దాదాపు ప్రతిసారి తెలుస్తుంది సార్ ఎవరు దొంగతనం చేసి తీసుకెళుతున్నారో అయినా మేము అడగలేము సార్. వాళ్ళు పెద్దోళ్ళు సార్ మామీద చెయ్యి చేసుకొంటారు. మేము కంప్లైంట్ చేసినా ఫలితం ఉండదు సార్.
చివరిగా నేను అడిగిన ప్రశ్నకు అతని సమాధానం మరీ ఇబ్బంది పెట్టింది!
నీ జీతం ఎంత?
సార్ 8 వేలు.
మరి జీతంలో ఎంత కట్ అవుతుంది?
సార్ 4 సం నుండి ఈ ఉద్యోగం చేస్తున్నా, ఇంతవరకూ ఒక్క నెలకూడా పూర్తి జీతం తీసుకొని ఇంటికి వెళ్ళలేదు.
అంతకు మించి నేను అతనితో మాట్లాడలేకపోయాను. కేవలం 8వేల జీతానికి పనిచేసేవాడు, ఆ 8వేలతో పిల్లల పోషణ చదువులు చూడాల్సినవాడు, బలిసినోడి స్వార్థానికి, అత్యాశకు బలి అవుతున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)