16 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులు నిలిపివేత

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్  రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 16 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతులు నిలిపివేసింది. గతేడాది 274 కళాశాలలకు అనుమతులు ఇవ్వగా ఈసారి 258 విద్యాసంస్థలకే ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్‌ సీట్లు, కళాశాలల అనుమతుల జాబితాను ఈ విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ విడుదల చేసింది. కృత్రిమ మేధ, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ తదితర తొమ్మిది కొత్త కోర్సుల్లో ఈ ఏడాది 6,660 సీట్లు పెరిగాయి. ఆంధ్ర వర్సిటీ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ కళాశాలను నిర్వహిస్తున్నప్పటికీ తాజాగా ఏఐసీటీఈ అనుమతి తీసుకున్నారు. 

ఇందులో ఐదు కోర్సులకు 300 సీట్లు అందుబాటులో ఉన్నాయి.  వర్సిటీ కళాశాలల్లో 4 వేలు: విశ్వవిద్యాలయ కళాశాలల్లో 4,260 సీట్లకు అనుమతి లభించింది. డీమ్డ్‌ టు బీ వర్సిటీలు కేఎల్‌యూ, గీతం, విజ్ఞాన్‌లలో 6,840, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ఇడుపులపాయ, శ్రీకాకుళం, నూజివీడు క్యాంపస్‌లకు కలిపి 1,140 సీట్లకు ఆమోదం తెలిపింది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో కలిపి 1,43,254 సీట్లు అందుబాటులో ఉండగా ఈసారి 1,39,862కు తగ్గాయి. ఏఐసీటీఈ ఆమోదించిన జాబితా ప్రకారం అత్యధికంగా గుంటూరు జిల్లాలో 21,435 సీట్లు ఉండగా, శ్రీకాకుళంలో అత్యల్పంగా 2,940 సీట్లు ఉన్నాయి.   జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, వాటిల్లోని సీట్ల వివరాలు

Post a Comment

0Comments

Post a Comment (0)