చెల్లెళ్లే కాడెద్దులుగా...!

Telugu Lo Computer
0

 

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లా అష్టా మున్సిపాలిటీ పరిధిలోని నానక్‌పూర్‌ గ్రామంలో నివసిస్తున్న శైలేంద్ర కుష్వాహా ఎద్దులు కొనేందుకు ఆర్థిక స్తోమత లేక తన ఇద్దరు చెళ్లేలను కాడెద్దులుగా మార్చాడు.  సోయాబీన్స్‌ పండించేందుకు దాదాపు నాలుగు ఎకరాల భూమిని ఇద్దరు చెల్లెళ్లు అరక లాగుతూ దున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సొంత జిల్లా అయిన సెహోర్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

తన తండ్రి పదేళ్ల క్రితం మరణించాడని, అప్పటినుంచి తమ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని శైలేంద్ర కుష్వాహా తెలిపాడు. తండ్రి మరణించినప్పటి నుంచి తాను సంపాదిస్తేనే ఇల్లు గడుస్తోందన్నాడు. తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి తాను వ్యవసాయం చేస్తున్నానని కుష్వాహా వివరించాడు. పొలం దున్నేందుకు అవసరమైన  ఎద్దులు కొనేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని.. గత్యంతరం లేకే తన చెల్లెళ్లతో పొలం దున్నిస్తున్నానని వాపోయాడు. కొన్నేళ్లుగా తన సోదరీమణులతో కలిసి ఇలాగే పొలం సాగుచేస్తున్నట్లు తెలిపాడు. ఇద్దరు చెల్లెళ్లతో కుష్వాహా పొలం దున్నుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)