ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న కపిల !

Telugu Lo Computer
0


ఖమ్మం జిల్లా కల్లూరు పంచాయితీ లోని చిన్న గ్రామం  ఖాన్ పేట. అందులో ఓ పూరి గుడిసె. చదువులో అసాధారణ ప్రతిభ, చక్కటి ముఖ వర్ఛస్సు, కొండంత ఆత్మ విశ్వాసం, భవిష్యత్ పట్ల స్పష్టమైన ప్రణాళిక అన్నీ ఉన్నాయి. లేనిదల్లా ఒకటే. డబ్బు. రామచంద్రమూర్తి, అరుణ అనే నిరుపేద దంపతుల ఏకైక సంతానం కపిల. చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. కల్లూరు సర్కారు బళ్ళో చదివింది. టెన్త్ పరీక్షల్లో స్కూల్ కి మంచి పేరు తెస్తుందని టీచర్లు ఆశలు పెట్టుకున్నారు. సరిగ్గా పదిరోజుల్లో పరీక్షలనగా హఠాత్తుగా తండ్రి మరణించాడు. ఒక్కసారిగా తల్లీకూతుళ్ళు షాక్ కు గురయ్యారు.అయినా కపిల పరిస్థితి అర్ధం చేసుకుంది. గుండె నిబ్బరం చేసుకుంది. పరీక్షలు రాసింది. ఫలితాలు వచ్చాయి. అందరి ఆశలు నిజం చేస్తూ మండలంలో టాపర్ గా నిలిచింది.10కి10 జిపి ఏ  సాధించి .బాసర ఐ ఐ ఐ టి లో సీటు సాధించింది. ఇంటర్ లోనూ అద్భుత ప్రతిభ చూపించింది.ఇప్పుడు అక్కడే బీటెక్ (సీఈసీ) ఫస్టియర్ చదువుతుంది. వరంగల్ కలెక్టర్ గా పనిచేసి, ఇప్పుడు కేంద్ర సర్వీస్ లో ఉన్న ఐ.ఏ.ఎస్.అధికారి కాట ఆమ్రపాలి  తనకు ఆదర్శం అనీ, తనలాగే ఐ ఏ ఎస్  సాధించాలనీ, తనలాంటి ఎందరో నిరుపేదలకు చేయూతనివ్వాలనేది తన జీవితాశయం అని చెప్తోంది. బీటెక్. పూర్తిచేసి రెండేళ్లు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసి కొన్ని డబ్బులు సంపాదించి వాటితో ఐ.ఏ.ఎస్ కు ప్రిపేర్ అవుతానని, ఖచ్చితంగా సాధిస్తానని చెప్తోంది. ఇటువంటి వారికి ప్రభుత్వ చేయూత తప్పనిసరి. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)