షర్మిల కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు


పరిగిలో వరి కొనుగోలు తీరును పరిశీలించేందుకు హైదరాబాద్ నుండి వెలుతుండగా పూడూరు మండలం అంగడిజితెంపల్లి గేటు వద్దకు రాగానే షర్మిల కాన్వాయ్‌ను నిలిపివేశారు.  కొవిడ్ కారణంగా షర్మిల కాన్వాయ్‌లో రెండు వాహనాలకే అనుమతి లభించింది. దీంతో కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను చింతపల్లి దగ్గర పోలీసులు నిలిపివేశారు. ఈ సందర్భంగా కాసేపు పోలీసులకు, వైఎస్సార్‌టీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఐదు వాహనాల చొప్పున అనుమతించారు. దీనితో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. 

Post a Comment

Previous Post Next Post