ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జులై 8వ తేదీన వైఎస్‌ఆర్‌ రైతు దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. అదే విధంగా వంద ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. 640 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 45 కొత్త రైతు బజార్లను ఏర్పాటు చెయ్యాలని, ఆర్‌బీకేల వద్ద గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఊటుకూరులో నాటుకోళ్ల హేచరీస్‌ ఏర్పాటుచెయ్యాలని, పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కీలక నిర్ణయాలు

రూ.89 కోట్లతో మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలు, వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి ఆమోదం, మౌలిక వసతుల కల్పనకు రూ.34వేల కోట్లు ఖర్చు, అమ్మఒడి డబ్బులు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌, రూ.339కోట్లతో ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్శిటీ ఏర్పాటు, జులై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణాలకు శంకుస్థాపన, ఇల్లు నిర్మాణానికి ఒక్కొక్కరికి లక్షా 80వేల రూపాయల ఆర్థిక సాయం, ఇళ్ల స్థలం పొందిన లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు, విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను యూనివర్శిటీగా మారుస్తూ నిర్ణయం, మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు, లాభాపేక్ష లేకుండా నగరాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న స్థలాల సేకరణ, మధ్యతరగతి ప్రజలకు కేటాయింపు, వ్యవసాయేతర ఆస్తులకు పట్టాదారు పాస్‌ పుస్తకం, కాకినాడ సెజ్‌లో 2,180ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయం, పీహెచ్‌సీల కోసం 539 కొత్త 104 వాహనాల కొనుగోలు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)