కిమ్‌ వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయ్ !

Telugu Lo Computer
0



గత వారం కిమ్‌ అమెరికా కొత్త ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ‘‘చర్చలకైనా,  యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలి’’ అని తన సేనలకు సూచించారు. ఆదివారం ఈ వ్యాఖ్యలపై అమెరికా స్పందిస్తూ, దీనిని మేము ఆసక్తికరమైన సంకేతంగా భావిస్తున్నాం అని పేర్కొంది. కానీ, అణ్వాయుధాలను త్యజించే అంశాలపై చర్చలకు ప్యాంగ్యాంగ్‌ నుంచి నేరుగా కచ్చితమైన సంకేతాలు రానంత కాలం తాము వేచిచూస్తామని పేర్కొంది. ఉత్తరకొరియా అధ్యక్షులు  కిమ్‌జోంగ్‌ ఉన్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై  ప్రకటన చేశారు.
ఉత్తర కొరియా చర్చలకైనా, ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అమెరికాలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం దౌత్య సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కిమ్‌ సర్కారు ఆసక్తి చూపలేదు. తాజాగా తొలిసారి అమెరికాపై కిమ్‌ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రారంభమైన ఉత్తర కొరియా సీనియర్‌ నాయకుల సమావేశంలో కిమ్‌ మాట్లాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)