అవసరమైనవే తెరవాలి : సీఐఐ

Telugu Lo Computer
0


దేశంలో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉండాలంటే.. ప్రభుత్వాలు జాగ్రత్తగా లాక్ డౌన్ ను ఎత్తేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) నూతన అధ్యక్షుడు టి.వి. నరేంద్రన్ అన్నారు. అవసరమున్న వాటినే తెరవాలని ఆయన సూచించారు. లేదంటే మూడో వేవ్ ముప్పును కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు. సరఫరా గొలుసు వ్యవస్థను పునరుద్ధరించే కార్యకలాపాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. తద్వారా ఆర్థిక వృద్ధి ఊపందుకోవడంతో పాటు ప్రజలకు జీవనోపాధి లభిస్తుందన్నారు.

‘‘ఒకేసారి అన్నింటినీ ఓపెన్ చేయడం సరికాదు. ఏవి అవసరమో, ఏవి అవసరం లేదో ఓ జాబితా సిద్ధం చేసుకోవాలి. అందుకు తగ్గట్టు అవసరమున్న వాటిని ఓపెన్ తెరచి,  మిగతా వాటిని మూసే ఉంచడం మంచిది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే కార్యకలాపాలను మాత్రం ఇప్పుడు ప్రారంభిస్తే చాలు. సామాజిక కార్యక్రమాల ప్రారంభానికి మరికొన్ని నెలలు ఆగినా ఫర్వాలేదు. అలాగైతేనే థర్డ్ వేవ్  ముప్పును తగ్గించగలుగుతాం’’ అని ఆయన అన్నారు.

రెండో దశ కట్టడి కోసం రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్‌, మే నెలల్లో ఆర్థిక వ్యవస్థ పట్టు తప్పిందని నరేంద్రన్ తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో అది స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. రోజుకి కనీసం 71.2 లక్షల కరోనా టీకా డోసుల్ని పంపిణీ చేయాల్సిన  అవసరం ఉందని సూచించారు. అలా అయితేనే ఈ ఏడాది చివరి నాటికి దేశంలో ఉన్న వయోజనులందరికీ టీకాలు ఇవ్వగలమని అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)