ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రత్యేకతలు!

Telugu Lo Computer
0

 

డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై నిర్వహణ వ్యయం ఎక్కువైంది. డీజిల్‌ బస్సుల కంటే ఎలక్ట్రిక్‌ బస్సులతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదించిన ప్రభుత్వం. వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం ! 

తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్డులో ప్రయాణం కోసం 9 మీటర్ల పొడవున్న బస్సులు.. మిగిలిన చోట్ల 12 మీటర్ల పొడవున్న బస్సులు నడపాలని నిర్ణయించారు. 9 మీటర్లు పొడవున్న బస్సు ధర రూ.1.25 కోట్లు, 12 మీటర్ల పొడవున్న బస్సు ధర రూ.1.50 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ మాన్యూఫాక్చరింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌) పథకం కింద 9 మీటర్ల బస్సుకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సుకు రూ.55 లక్షల రాయితీ ఇస్తుంది. విశాఖపట్నంలో బస్సు ఫ్లోర్‌ భూమి నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తులో.. మిగిలిన చోట్ల 90 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేవి నడపనున్నారు.

డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై నిర్వహణ వ్యయం ఎక్కువైంది. డీజిల్‌ బస్సుల కంటే ఎలక్ట్రిక్‌ బస్సులతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. రోజుకు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసే 12 మీటర్ల పొడవున్న డీజీల్‌ ఏసీ బస్సుకు కి.మీ.కి రూ.52 ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుకు రూ.48 అవుతుంది. ఇక 9 మీటర్ల పొడవు ఉన్న ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుకు కి.మీ.కు రూ.45 అవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 9 మీటర్ల పొడవున్న డీజిల్‌ బస్సులు లేవు. ఎలక్ట్రిక్‌ బస్సులతో కాలుష్యం విడుదల కాదు, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఈ బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ డిపోల్లోనే అవకాశం కల్పించి, నిర్వాహకుల నుంచి చార్జీలను వసూలు చేస్తారు.

ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదించిన ప్రభుత్వం.. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు నివేదించమని ఆర్టీసీని ఆదేశించింది. ఆర్టీసీ అధికారులు ఒకటి రెండు రోజుల్లో జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపడతారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందడుగు వేస్తూ ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)