వ్యాక్సిన్ తో యాంటీబాడీలు !

Telugu Lo Computer
0


మొదటి వేవ్ లో కరోనా వచ్చిన వారికి రెండోవేవ్ లో కరోనా దాదాపుగా రాలేదు. వచ్చినా, ఏ లక్షణాలు లేని వారే ఎక్కువ.

కొంతమందిలో లక్షణాలు వచ్చినా ఇది వాళ్ళకి రెండోసారి కావడంతో చాలా తక్కువ లక్షణాలు మాత్రమే కనిపించాయి. త్వరగా సులువుగా కోలుకున్నారు.
కరోనా వచ్చినవారందరూ దాదాపు సేఫ్. కరోనా రాకున్నా సేఫ్ గా ఉండాలంటే మార్గమేంటి?.
వ్యాక్సిన్.
వ్యాక్సిన్ లో కరోనా కు సంబంధించిన ప్రొటీన్ ను తక్కువ మోతాదులో ఇస్తారు కనుక మన శరీరం దానిని కరోనానే అనుకుని తగిన యాంటీబాడీలను తయారు చేసుకుంటుంది. అందుకే వ్యాక్సిన్ వేసుకోవడమంటే తక్కువ లక్షణాలుగల కరోనా వంటి ఇన్ఫెక్షన్ తెచ్చేసుకుని వీలైనంత ఎక్కువగా యాంటీబాడీలను తెచ్చేసుకోవడమే.
కరోనా తెచ్చుకుని రోజుల తరబడి ఇబ్బంది పడి హాస్పిటల్స్ లో పడి డబ్బులు ఖర్చు చేసుకుని యాంటీబాడీలు తెచ్చుకోవడం కంటే..సునాయాసంగా..ఖర్చే లేకుండా. వ్యాక్సిన్ తో యాంటీబాడీలు తెచ్చుకోవడం సులభం. ఆలోచించండి.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)