అది ఆర్థిక రహస్యం !

Telugu Lo Computer
0


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని నెలలుగా ఏపీలో ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఆందోళన నిర్వహిస్తున్నాయి. కోవిడ్‌ విజృంభణతో తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన కార్మిక సంఘాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. దీనిలో భాగంగా యాజమాన్యానికి  సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు కేంద్ర ఆర్థికశాఖ నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్‌ అడిగిన సమాచారం ఇచ్చేందుకు విత్త మంత్రిత్వ శాఖ అంగీకరించలేదు. ‘ఉక్కు’లో  పెట్టబడులు ఉపసంహరణ అంశం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 8ఎ ప్రకారం ఆర్థిక రహస్యాల పరిధిలోకి వస్తుందని ఆర్థికశాఖ తెలిపింది. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖలకు జవాబివ్వాలని పీఎంవో ఆర్థికశాఖ డీఐపీఏఎంకు సూచించింది. అయితే ఆర్‌ఐఎన్‌ఎల్‌ విక్రయంపై సమాచారం గోప్యమని పేర్కొంటూ పేర్కొంటూ పీఎంవో ఆదేశాలను ఆర్థికశాఖ డీఐపీఏఎం తిరస్కరించింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)