కొబ్బరి పువ్వు....!

Telugu Lo Computer
0


ఉభయ గోదావరి జిల్లాలలో సీజన్ లో విరివిగా దొరుకుతుంది . తోపుడు బళ్ళ మీద పెట్టి కాకినాడ మార్కెట్ వీధిలో వరుసగా పెట్టుకుని అమ్ముతారు.

హైదరాబాద్ , సికింద్రాబాద్ మార్కెట్లలో కూడా చెక్క బండి మీద పెట్టి అమ్ముతారు .
చాలా రుచిగా ఉండే ఈ కొబ్బరి పువ్వులంటే ఎంతోమంది ఇష్టపడతారు .
మనం దేవునికి నివేదించే నారికేళం లో కనుక కొబ్బరి పువ్వు కన్పిస్తే చాలా అదృష్టంగా భావిస్తారు.
ఏదైనా కోరిక కోరుకున్న వారు వారు నివేదించిన కొబ్బరి కాయలో పువ్వు కన్పిస్తే , అది శుభసూచికంగా , వారి కోరిక తప్పక నెరవేరుతుందని భావిస్తారు.
ఇక కొబ్బరి పువ్వు గురించి తెలియని వారి కోసము .
" కొబ్బరి పువ్వు ఏం చేస్తారని " ఒకరు అడిగారు.
కొబ్బరి పువ్వును తింటారమ్మా. మధురాతి మధురంగా ఉంటుంది .
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)