"ఆవేదనతో పుట్టిన ప్యానల్‌ ఇది"

Telugu Lo Computer
0

 

పదవుల కోసం కకుండా పని చేయడానికి పోటీ పడుతున్నాం. కోపంతో కాకుండా ఆవేదనతో పుట్టిన ప్యానల్‌ ఇది. మా అర్హతలు, మా ప్రణాళికలు చూసి ఓటేయండి. నాకున్న టైమ్‌లో షూటింగ్‌ చేస్తా. డైరెక్షన్‌ చేస్తా. ప్రొడక్షన్‌ చేస్తా. పొలం చూసుకుంటా. భార్యాబిడ్డలను చూసుకుంటా. సమయం విలువ తెలిసినవాడి దగ్గర ఇంకా ఎక్కువ టైమ్‌ ఉంటుంది'' అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ ''ప్రస్తుత 'మా' పరిస్థితి వివరించి, ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడానికి అవసరమైన ప్రణాళికలను ప్రకాశ్‌రాజ్‌ రెండు నెలల క్రితం వివరించారు. నాకెంతో నచ్చాయి. అన్ని భాషల చిత్రసీమలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అందరితో మాట్లాడగలరు. దీనికి తోడు ఆయనలో సేవా గుణం, గ్రామాల దత్తత నచ్చి మద్దతిస్తున్నా. నాన్‌-లోకల్‌ అనేది అర్థరహిత వాదన. 'మా'లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో ఏ పదవికైనా పోటీ చేసే హక్కు ఉంది. మనమంతా తెలుగు కాదు... భారతీయ కళాకారులం. మాకు అన్నయ్య (చిరంజీవి) ఆశీస్సులు ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్‌తో 'మాకు ఉపయోగపడే ఏ పనైనా మీరు చేయండి. నేను నేరుగా ఇన్వాల్వ్‌ కాను. కానీ, మంచి పనులు చేస్తే మద్దతుగా ఉంటా' అని అన్నయ్య చెప్పారు.

'గత నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ప్రతిష్ఠ మసకబారింది. 'మా' గౌరవం తగ్గింది. ఈసారి ఆ గౌరవం తగ్గకూడదు. ఒక స్థాయిలో ఉండాలని మేమంతా నిర్ణయించుకున్నాం. ప్రకాశ్‌రాజ్‌ లాంటి వివాదరహితుడు, మంచి వ్యక్తి వెనుక మేమంతా ఉంటాం'' అన్నారు నాగబాబు. రాబోయే 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న ప్రకాశ్‌రాజ్‌, ఆయన ప్యానల్‌ సభ్యులతో కలిసి శుక్రవారం మీడియా ముందుకొచ్చారు. ఎన్నికల తేదీ ప్రకటించే వరకూ తమ ప్యానల్‌ సభ్యులెవరూ మీడియా ముందుకు రారని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''మాది సినిమా బిడ్డల ప్యానల్‌.

 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నట్టు నాతో చెప్పారు. ఆయన విజన్‌ వివరించారు. ఆయన ఆలోచనలు నాకు నచ్చాయి. ఆయనకు అండగా నిలబడ్డా. మా ప్యానల్‌ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా'' అని జయసుధ పేర్కొన్నారు. ''ప్రకాశ్‌రాజ్‌గారికి 'మా' అభివృద్ధిపై ఉన్న ఐడియాలజీ నచ్చడంతో ఆయనకు మద్దతుగా, ఆయన ప్యానల్‌ నుంచి పోటీ చేస్తున్నా. పరభాషా హీరోయిన్లతో సినిమాలు చేసేటప్పుడు నాన్‌-లోకల్‌ వంటి మాటలు రావు. బాధ్యతలు తీసుకునేటప్పుడు లోకల్‌, నాన్‌-లోకల్‌ వంటివి ఎందుకు వస్తున్నాయో?'' అని అనసూయా భరద్వాజ్‌ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో తానూ ఉండటం ఆనందంగా ఉందన్నారు సాయికుమార్‌. బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ''గత అధ్యక్షులు చేసిన పనుల్ని వేలెత్తి చూపించం. గతం గతః. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ అనుకున్న పనిని 100శాతం చేస్తారు. 27 ఏళ్ల తర్వాత 'మా'కు సొంత భవనం కల నెరవేరబోతోంది. మేమంతా ఒక్కటే. 'మా'లో మాకు కులాలు, వర్గాలు లేవు'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెజారిటీ ప్యానల్‌ సభ్యులు పాల్గొన్నారు. జయసుధ, సాయికుమార్‌ వీడియో బైట్లు విడుదల చేయగా, మిగతావాళ్లలో కొందరు నగరంలో లేకపోవడం, ఇంకొందరు చిత్రీకరణలు చేస్తుండటం వలన రాలేకపోయారని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)