‘మా’ అధ్యక్ష రేసులో మరో నటి !

Telugu Lo Computer
0

 


‘మా’ అధ్యక్ష ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధ్యక్ష పదవికి బరిలో దిగిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్​లు ఎవరికి వారే ఎన్నికల్లో గెలిచేందుకు తమ ప్లాన్లను  అమలు చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ ఫ్యామిలీ  మద్దతుతో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండగా,  మోహన్ బాబు ఆశీస్సులతో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఇక జీవిత రాజశేఖర్ కూడా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు మద్దతు కూడగడుతున్నారు.  ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్ సహాయ నటి హేమ కూడా ‘మా’ అధ్యక్ష పదవి రేస్‌లోకి దూసుకొచ్చారు. గతంలో మా అసోసియేషన్ లో ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పనిచేసిన హేమ.. మహిళా నటీమణుల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఎలక్షన్స్ లో తొలుత ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని అనుకున్న హేమ.. తన వారి కోసం అధ్యక్ష పదవి రేస్‌లోకి దిగబోతున్నట్లు  ప్రకటించారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)