జియో కొత్త ఫీచర్‌!

Telugu Lo Computer
0


జియో యూజర్లు ఇకపై ఫోన్‌ రీఛార్జ్‌లు, చెల్లింపులు, మొబైల్‌ పోర్టబిలిటీ, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, జియోమార్ట్‌ వంటి సేవలను వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు. దీంతో పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌, టీకా లభ్యతకు సంబంధించిన సమాచారం కూడా వాట్సాప్‌లో తెలుసుకోవచ్చు అని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం యూజర్లు జియో కేర్‌ నంబర్‌ను +91 70007 70007ను వాట్సాప్‌లో సేవ్‌ చేసుకుని దానికి Hi అని మెసేజ్‌ పంపాలి. అప్పుడే ఈ చాట్‌బాట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. 

హాయ్‌ అని పంపించిన తర్వాత యూజర్లకు సేవల మెనూ కన్పిస్తోంది. అందులో కొవిడ్‌ వ్యాక్సిన్‌ సమాచారం, జియో సిమ్‌ రీఛార్జ్‌, పోర్టబిలిటీ వంటి తదితర ఆప్షన్లు ఉన్నాయి. మనం ఏది ఎంపిక చేసుకుంటే దానికి సంబంధించిన వివరాలను పంపిస్తుంది. పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేస్తే టీకా కేంద్రాల సమాచారం వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)