యోగ....!

Telugu Lo Computer
0

అష్టాంగయోగము ! పతంజలిమహర్షి భారతజాతికి ప్రసాదించిన ఒక వరము !


యోగ ఈ మాటను భారతీయేతరులకు అనగా విదేశీయులకు పరిచయం చేసినవారు శ్రీ పౌల్ బ్రంటన్ ! ఒక బ్రిటిష్ జర్నలిష్టు ! వీరొక మాట అంటారు" Yoga is the emptying of mind of all things "!....
.
మన మనస్సును మొత్తం ఖాళీ చెయ్యాలట ! ...చేస్తే ? ...
.
అదేమిటి యోగమంటే కలయిక అన్నారు కదా ! ఇప్పుడు ఖాళీ చెయ్యమంటున్నారేమిటి ?
.
ఇలా ఒక్కసారి ఆగి గమనించండి !
.
మన మనస్సు ఒక సినిమా తెర అనుకుందాం ! సినిమా తెరమీద వేలాది స్లైడులు విరామంలేకుండా ఒకదానివెనుకమరొకటి వస్తూ ఉండటం వలన ఆస్లైడులలోని బొమ్మలు కదలుతూ ఉన్నాయనే భ్రమ కలుగుతుంది ! సినిమా మధ్యలో ఇంటర్వెల్ లో ప్రకటనల స్లైడులు ఆగిఆగి వస్తూ ఉంటాయి కదా ! ఒక స్లైడుకు మరొక స్లైడుకు మధ్య మనకు తెల్లని తెర కనపడుతుంది కదా !
.
నిజానికి తెరమీదకాంతిపడినప్పుడు మనకు రకరకాల అనుభూతులు కలుగుతాయికదా ! మనుషులు ఆడినట్లు పాడినట్లు ! కాని వాస్తవం ఏది ? ఆ తెల్లని తెర మాత్రమే !
.
అలాగే !
.
మనిషి మనస్సు అనే తెరమీద నిరంతరాయంగా ఎన్నో దృశ్యాల, స్పర్శల, శబ్దాలు ,రుచి ,గంధము అనగా smell ఇలా వివిధాలయిన స్లైడులు పడుతూనే ఉన్నాయి ! వాటివలన ఆలోచనా తరంగాలు కదలాడుతున్నాయి !
.
వాటికి విసుగులేదు మనకు విరామం లేదు !
.
మన మనస్సులో కూడా కాసేపు ఇంటర్వెల్ ఇచ్చిచూస్తే !
.
అంటే దృశ్యాల స్లైడులు తగ్గిస్తే !!! అనగా బాహ్యప్రపంచం నుండి ఇంద్రియాలు గ్రహించే వాటిని నియంత్రిస్తే ? .ఏమవుతుంది ..మనకు కాసేపు ఏమీలేని మనస్సనే తెల్లని తెర ప్రత్యక్ష మవుతుంది ! ...
.
ఇంకాస్త ముందుకెళ్ళి అసలు స్లైడులు పడకుండా ఆపగలిగితే ఎప్పుడూ తెల్లని తెరే ! ఆ తెల్లని తెర యే "ఆత్మ" అప్పుడే మనము ఆత్మతో అనుసంధానమయి స్వస్వరూపాన్ని దర్శించ గలుగు తాము!
.
అలా దర్శించ గలగటమే యోగము ! ....
.
అనగా యోగమంటే మనస్సును ఖాళీ చెయ్యటమే !
.
ఇలా ఖాళీ చెయ్యటం ఊరికే సాధ్యమవుతుందా ?
.
కాదు ! దానికి అభ్యాసం కావాలి ! ఆ అభ్యాసమార్గమే పతంజలి మహర్షి ప్రసాదించిన
"అష్టాంగ యోగము "!
.
ఎనిమిది అంగాలు అన్నమాట ! ఆ ఎనిమిది ...
యమ,నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార,ధారణ,ధ్యాన,సమాధి !!.,...
.
గతము మనిషికి ఒక జ్ఞాపకం
భవిష్యత్తు మనిషికి ఒక‌ఆలోచన
ఎప్పుడూ వర్తమానంలో అనగా ఈ క్షణంలో బ్రతకడమే యోగము !
.
అదేమిటి అంటారా !
SIP TEA WHILE YOU ARE SIPPING TEA ....టీ త్రాగే టప్పుడు టీ యే త్రాగు ! అనవసరపు ఆలోచనలతో మనస్సు ఉంటే టీ అనే ద్రవము యాంత్రికంగా గుటకలు వేస్తాముగానీ దాని రంగు రుచిని సువాసనను అనుభవించలేముకదా !
.
అలా ప్రతిక్షణాన్ని గుదిగుచ్చి ఆస్వాదిస్తూ వర్తమానంలో బ్రతకడమే యోగము !
.
అందుకే భగవానుడు గీతలో అంటారు "యోగః కర్మసుకౌశలమ్ " అని !
.
యోగము అంటే చేసేపనిమీద సంపూర్ణమైన శ్రద్ధపెట్టి పూర్తిచేయడమే !
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)