అంత: సౌందర్యం

Telugu Lo Computer
0


తన ప్రియురాలు పెద్ద ధనవంతురాలు. తనను విందుకు ఇంటికి పిలిచినప్పుడు,మాసిన బట్టలతో, చింపిరి గడ్డం,జుట్టుతో ఆ పెద్ద బంగ్లాలోనికి వెళ్ళాడు.

బట్టలు విడిచి టవల్ కట్టుకుని తానే ఆ బట్టలను ఉతికి ఆరబెట్టి తిరిగి వేసుకున్నాడు.
ధనవంతులైన ఆమె తల్లిదండ్రులు ఆయన పేదరికాన్ని చూసి ఛీదరించుకున్నారు అసహ్యించుకున్నారు. ఆమెను తిట్టి చివాట్లు పెట్టినా ఏమాత్రం పట్టించుకోలేదు ఆమె.
కొద్దిసేపటికి ప్రియుడు భోజనం చేస్తూ అమెతోటి జరిపిన సంభాషణ, ప్రపంచపోరాటాలు, దేశసమస్యలు, పరిష్కారమార్గాలు, తనకర్తవ్యాలు తెలియచేయడం చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.
తమ కంటే తన కూతురు ఉన్నతంగా ఆలోచించిదని, తాము పైకి కనపడే అందాన్ని మాత్రమే చూసాము తప్ప తన కుతురులా లోపలున్న మంచి మనసుని ఆలోచనల్ని చూడలేకపోయా౦ అని అనుకున్నారు.
ప్రపంచాన్నే ఈ విధంగా ప్రేమిస్తే తన కూతురిని ఇంకెలా ప్రేమిస్తాడో అని ఆశ్చర్యపోయి మనసులో ఆనందపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)