ఆ కారు కొనలేదు : సోనూసూద్

Telugu Lo Computer
0


కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ,  దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్.. లేటెస్ట్‌గా తన కొడుకుకి 3 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు కొనిచ్చారంటూ ఓ వార్త వైరల్ అయ్యింది. తన కొడుకు ఇషాన్‌కు ఫాదర్స్ డే రోజు డ్రెయినింగ్ మరియు ఎల్జీజూరిస్ లగ్జరీ కారును కొనిచ్చారంటూ పలు వార్తాసంస్థలు రాసుకొచ్చాయి. రూ. 3 కోట్ల విలువైన కారును.. ఇషాన్ ఇటీవల తన 18 ఏళ్ల కొడుక్కి కొనిచ్చారని వార్తలు రాగా.. ఆ వార్తలపై సోను సూద్ క్లారిటీ ఇచ్చారు.

“నా కొడుకుకు లగ్జరీ కారు కొనిచ్చాననే వార్తల్లో నిజం లేదు.. నా కొడుకు కోసం నేను కారు కొనలేదు. ఈ కారు ట్రయల్ కోసం మాత్రమే మా ఇంటికి తీసుకుని వచ్చారు. మేము దానిని టెస్ట్ రన్ చేశామంతే, ఈ కారు ఇంకా కొనలేదు.”అంటూ క్లారిటీ ఇచ్చారు సోనూసూద్. ‘ఫాదర్స్ డే సందర్భంగా నేను నా కొడుకుకు కారు ఎందుకు బహుమతిగా ఇస్తాను? అతను నాకు ఏదైనా బహుమతి ఇవ్వాలి కదా? అన్నారు. నేను నా ఇద్దరు కొడుకులతో రోజంతా గడిపినప్పుడే నాకు బెస్ట్ ఫాదర్స్ డే గిఫ్ట్. నేను వారికి సమయం ఇవ్వలేకపోతున్నాను. వాళ్లు పెద్దవాళ్లు అయిపోతున్నారు. ఈ సంధర్భంగా చాలామంది ఈ ఊహాగానాలు నిజమేనని నమ్మినప్పటికీ, కొందరు మాత్రం తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం సంతోషాన్నిచ్చిందని అన్నాడు సోనూసూద్. ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)