ఇళ్ల ధరలు తగ్గాయ్ !


అంతర్జాతీయంగా గృహాల ధరల్లో వార్షిక వృద్ధి ఎలా ఉందనే అంశంపై నైట్‌ ఫ్రాంక్‌ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌కు 55వ స్థానం లభించింది.  ప్రపంచ వ్యాప్తంగా 56 దేశాలతో రూపొందించిన ఈ నివేదికలో భారత్‌ 55వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. 56వ స్థానంలో స్పెయిన్‌ నిలిచింది. . స్థిరాస్తి ధరలు 32 శాతం పెరగడంతో, ఈ నివేదికలో టర్కీ అగ్ర స్థానం దక్కించుకుంది. గత మార్చిలో విడుదల చేసిన నివేదికలో 56వ స్థానంలో ఉన్న భారత్‌ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుంది. 2020 తొలి త్రైమాసికంలో 43వ స్థానంలో ఉండగా, తాజాగా 12 స్థానాలు కోల్పోయింది. స్పెయిన్‌లో 1.8 శాతం ధరలు క్షీణించగా, భారత్‌లో 1.6 శాతం మేర క్షీణించినట్లు నివేదిక తెలిపింది. భారత్‌లో ఇళ్ల ధరలు 2020 జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో 1.6 శాతం మేర తగ్గాయని నైట్‌ ఫ్రాంక్‌ పరిశోధనా నివేదిక వెల్లడించింది 

Post a Comment

Previous Post Next Post