వ్యాక్సిన్ పేరిట ఎంపీకే మస్కా!

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాకి దగ్గరలో కాస్బా ప్రాంతంలో నకిలీ  ఐఏఎస్ బాగోతం బయటపడింది. దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి  తాను కోల్ కతా కార్పొరేషన్ జాయింట్ కమిషనర్ నని, కాస్బా ప్రాంతంలో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టామని,  ఆ కార్యక్రమానికి అతిధిగా రావాలని టీఎంసి ఎంపీ మిమి చక్రవర్తిని కలిశాడు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావడంతో ఎంపీ కూడా సరేనని కార్యక్రమంలో పాల్గొని టీకా కూడా తీసుకున్నారు. అయితే టీకా తీసుకున్నా ఫోన్ కు సమాచారం రాలేదు. సర్టిఫికెట్ అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానించిన ఎంపీ తన అనుచరులతో విచారణ చేయించారు.  కొద్దిరోజుల క్రితం ఇలానే సోనార్ పూర్ లో ఆటో డ్రైవర్ల కోసం ఇలానే ఫేక్ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు ఏ ఉద్దేశ్యంతో ఇలా డ్రైవ్ చేపడుతున్నాడోనని దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా ఎంపీనే బురిడీ కొట్టించిన ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కాగా.. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టే వెళ్లి వ్యాక్సిన్ కూడా తీసుకున్నానని కానీ ఇలాంటి వారు ఉంటారని అనుకోలేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)