సహకారానికి బ్రిక్స్ దేశాల అంగీకారం

Telugu Lo Computer
0


11వ బ్రిక్స్ ఎస్ అండ్ టి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆవిష్కరణల అంశంలో సహకారానికి బ్రిక్స్ దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. భారత్ ప్రతిపాదించిన ఈ అంశాన్నివిస్త్రత కార్యచరణ ప్రణాళిక రూపొందించేందుకు బ్రిక్స్ సైన్స్‌,టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ ఎంటర్ప్రెన్యూర్‌షిప్ (ఎస్‌టిఐఇపి) వర్కింగ్ గ్రూప్‌ గా పరిగణిస్తారు. బ్రిక్స్ శాస్త్ర,సాంకేతిక, ఆవిష్కరణ వ్యవస్థాపకత క్యాలెండర్ కార్యకలాపాల అమలును సమీక్షించేందుకు బ్రిక్స్ ఆవిష్కరణ సహకారం 2021-2022కు కాన్సెప్ట్ నోట్ ను , కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో చర్చించారు.

బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్స్ కాంక్లేవ్‌, బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం, బ్రిక్స్ శాస్త్ర, సాంకేతిక మినిస్టీరియల్ మీటింగ్‌, భారత సాంకేతికతలో బ్రిక్స్ భాగస్వామ్య సదస్సుతో పాటుగా 2021కి ప్రతిపాదనల ఆహ్వానాలు కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి బ్రిక్స్ శాస్త్ర, సాంకేతిక మంత్రివర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. భారత శాస్త్ర, సాంకేతికశాఖ నిర్వహించిన ఈ సమావేశానికి భారతదేశం తరఫున అంతర్జాతీయ సహకార సలహాదారు సంజీవ్ కుమార్ వార్ష్నే అధ్యక్షత వహించారు. ఈసమావేశంలో పరిశ్రమలు,అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకశాఖ (డిపిఐఐటి), కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సిఐఐ) ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)