పారదర్శకంగానే కేటాయింపు: కేంద్రం

Telugu Lo Computer
0


ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల ఆధారంగానే భారత్‌లో టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. జనసంఖ్య, కేసుల పెరుగుదల, టీకాల వృథా నియంత్రణ ప్రాతిపదికగానే రాష్ట్రాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. క్రమబద్ధమైన ప్రణాళికను అనుసరిస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమర్థమైన భాగస్వామ్యం ద్వారా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నామని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.  కొవిడ్ 19 వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పారదర్శకంగా కేటాయించలేదని వచ్చిన మీడియా కథనాలను, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిరాధారమైనవిగా పేర్కొంటూ కొట్టిపారేసింది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)