జమ్మూకశ్మీర్‌పై ముగిసిన అఖిలపక్ష భేటీ

Telugu Lo Computer
0

 


జమ్మూకాశ్మీర్‌కు చెందిన ప్రధాన పార్టీల ముఖ్య నేతలతో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశానికి హోమ్ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. పీడీపీ నుంచి మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్‌, సిపిఎం నుండి యూసఫ్ తరగామితో పాటు ఇతర పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు 14 మంది నేతలతో రెండు గంటలకుపైగా సమావేశం నిర్వహించారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కాశ్మీర్‌ నేతలతో జరుగుతున్న తొలి అఖిలపక్ష సమావేశం ఇదే కావడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుధ్దరించడంపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధి గురించి నేతలు ప్రస్తావించిన పలు అంశాలను ఓపిగ్గా విన్నారని అన్నారు. జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధిలో భాగంగా ఐదు డిమాండ్లను సమావేశం మందుంచినట్లు కాంగ్రెస్ నేత  గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, కాశ్మీర్‌  పండిట్లకు పునరావాసం తదితర అంశాలను లేవనెత్తినట్లు చెప్పారు. రాష్ట్ర హోదా పునరుధ్దరణకు కట్టుబడి ఉన్నామని హోమ్ మంత్రి అమిత్ షా చెప్పినట్లు తెలిపారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)