స్వీయానుభవం.....!

Telugu Lo Computer
0

 

క్రిటికల్ కండిషన్లో వెంటిలేటర్ బెడ్ మీద ఉన్న పేషేంట్లు అవగాహనా రాహిత్యంతో చేసే పొరపాట్లు చాలాసార్లు ప్రాణాలు కోల్పోడానికి కారణం అవుతాయి. ఆ కండిషన్లో సున్నితమైన అనేక అంశాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గత కొన్ని పోస్టులలో వివరించాను. ఈ కండీషన్లో ఎవరైనా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఎట్టి పరిస్థితిలోనూ #ఆక్సీజెన్ వదలకూడదు. కొంచెం సేపే కదా అని #నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఆ నిర్లక్ష్యం విలువ మీ #ప్రాణం.
నేను 4 రోజుల పాటు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇక ఇతను బ్రతకడు అన్న స్థితిలో నన్ను ఫోర్స్ ఫుల్ డిశ్చార్జ్ చేసారు. ఆ స్థితిలో నన్ను గాంధీలో ఎమర్జెన్సీ వార్డ్ లో పడేసి అప్పటి దాకా నాతో ఉన్న అటెండెంట్ కూడా ఎలాగూ బ్రతకడని చెప్పకుండా పారిపోయి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యలేదు. అప్పుడు నాకు స్పృహ లేదు, గంటకు, రెండు గంటలకో మెలుకువ వచ్చేది. నాకు స్పృహ లేని సంగతి నాకు తెలియదు. నేను నిద్రపోతున్నానని అనుకుంటున్నాను. అపుడు నా శాచురేషన్ 40 దాకా పడిపోయిందని నాకు తరువాత తెలిసింది. అటువంటి స్థితిలో నేను గాంధీలో ఉన్నానని తెలుసుకుని Nalgonda Anji అక్కడకు చేరుకున్నాడు. ఆ రాత్రి మర్నాడు కూడా అంజి నాతోనే ఉన్నాడు. బంధువులు కొందరు నా భార్యను కూడా నేను బ్రతకను అనే విషయానికి మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అతను జారిపోయాడు. ఇక కష్టం అని చెప్పకనే చెబుతున్నారు.
అటువంటి స్థితి నుంచి కూడా నేను తిరిగి కోలుకోడానికి కారణం డాక్టర్ల ట్రీట్మెంట్తో పాటు నా మనోధైర్యం మరియూ ఆక్సీజెన్ పట్ల నేను వహించిన శ్రద్ధ. యూరిన్ కి వెళ్లి వచ్చేలోపే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి యూరిన్ బ్యాగ్ అమర్చారు. అలాగే డైపర్లు కూడా పెట్టారు. ఇక ఎన్ని రోజులయినా బెడ్ దిగాల్సిన పనిలేదు. ఆహరం తీసుకునేటపుడు కూడా ఆక్సీజెన్ వదలలేదు. అయితే సమస్య వెంటిలేటర్ మాస్క్ అమర్చిన మొదటి రెండు, మూడు రోజులు నోరు విపరీతంగా పొడిబారి పోతుంది. మాటి మాటికీ దాహం అవుతుంది. నీళ్లు తాగాల్సిన ప్రతీసారి మాస్క్ మొత్తం విప్పి మళ్ళీ బలంగా కట్టాల్సివస్తుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో మొదటి రోజు తట్టలేదు.
ఆలోచించగా రెండవ రోజు నిండిపోయిన యూరిన్ బ్యాగ్ ను మార్చుతుండగా ఐడియా తట్టింది. నాతో అటెండెంట్ గా ఉన్న అమ్మాయిని మరో కొత్త యూరిన్ బ్యాగ్ తీసుకురమ్మని చెప్పాను. ఆ యూరిన్ బ్యాగ్ కి attached గా ఉన్న పొడవైన స్ట్రా లాంటి పైప్ ను కట్ చేసి సపరేట్ చేయమని చెప్పాను. ఆ అమ్మాయి ఆ విధంగానే చేసింది. తరువాత ఒక బాటిల్లో ఎలెక్ట్రోల్ వాటర్తో నింపి బెడ్ కి యూరిన్ బ్యాగ్ కట్టినట్లే కట్టివేయమని చెప్పను. ఆ బాటిల్ మూతకు రంధ్రం చేసి అందులో నుంచి స్ట్రా లాంటి పైప్ లోపలి పెట్టి మరో వైపు నా చేతికి అందేలాగ ఉంచమని చెప్పాను.
ఆ తరువాత ఎప్పుడు నోరు పొడిబారి పోయినా లేదా దాహం వేసినా ఆ స్ట్రా లాంటి పైప్ మాస్క్ తియ్యకుండానే క్రింది నుంచి కొంచెం సందు చేసుకుని నోట్లో పెట్టుకుని గట్టిగా పీల్చేవాడిని. ఈ విధానం ద్వారా దాహం వేసిన ప్రతీసారి అటెండెంట్ ని పిలవాల్సిన అవసరం ఏర్పడేది కాదు. ముఖ్యంగా రాత్రిపూట అటెండెండ్ అలసిపోయి నిద్ర పోతున్నప్పుడు వారిని నిద్ర లేపడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఈ విధానం ద్వారా చక్కగా వాటర్ తాగేవాడిని. అంతే కాకుండా ఆక్సీజెన్ కూడా పొంద గలిగేవాడిని.
ఎప్పుడయినా జీవితంలో సంక్షోభం ఏర్పడి క్రిటికల్ కండిషన్లోకి జారుకున్నపుడు భయపడ కూడదు. భయపడిన మెదడు చచ్చుబడి పోతుంది. ఎటువంటి ఆలోచనా రాదు. కేవలం భయంలేని మెదడు మాత్రమే మన మనస్సుకు సహకరిస్తుంది. భయపడకుండా వీలైనంత కొత్తగా ఏమి చేయగలమో ఆలోచించి జాగ్రత్తలు వహించడం ద్వారా ఎటువంటి స్థితి నుండయినా బయట పడగలము.

#HariRaghav 22.06.2021
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)