డెల్టా ప్లస్ కూడా ప్రమాదకరమే !

Telugu Lo Computer
0

డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త రమన్ గంగాఖేద్కర్ తెలిపారు. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందిందని, ఆ వేరియంట్‌ను ఆందోళనకరంగా గుర్తించామన్నారు. అలాగే డెల్టా ప్లస్ వేరియంట్‌ను కూడా ప్రమాదకరంగా భావించాలని గంగాఖేద్కర్ అభిప్రాయపడ్డారు. ఇండియాలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్‌కు చెందిన 50 కేసులను గుర్తించారు. మరో వైపు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక చేసింది. డెల్టా ప్లస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తి పట్ల నిబంధనలు కఠినంగా పాటించాలన్నది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)