అసామాన్య ప్రతిభాశాలి !

Telugu Lo Computer
0

 


మారుమూల పల్లెలో(భువనగిరి యాదాద్రి జిల్లా), పేదరికంలో పుట్టి 6వ తరగతిలో చదువు ఆగిపోయి అనేక కష్ఠాలనెదుర్కొని, తిట్లు, దూషణలను తట్టుకొని, మొక్కవోని దీక్షతో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుని పల్లె పతాకను దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఎగరేసిన బహుజన ప్రతిభావంతుడు చింతకింది మల్లేశం.
చేనేత కార్మిక కుటుంబంలో పుట్టిన మల్లేశం బాల్యం మగ్గం గుంటలో, ఆసుకర్రల చుట్టూ, నూలుదారాల చిక్కుల్లో ముడిపడింది. ఆసు దగ్గర రెక్కలు విరిగేలా చాకిరీ చేస్తున్న తల్లి, సోదరీమణులు, చుట్టుపక్కల ఆడవాళ్ళ కష్టాలను చూస్తూ పెరిగాడు. పనిచేసి చేసి రెక్కలు అరిగి కీళ్ళ నొప్పులతో భుజాలు పడిపోయిన తల్లి బాధకు తల్లడిల్లి ఆడోళ్ళ బాధలు తగ్గడానికి ఏమన్నా చేయాలన్న తపనతో బతుకుదెరువు కోసం నేర్చుకున్న ఎలక్ట్రికల్ పనిని ఉపయోగించి ఆసుయంత్రాన్ని రూపొందించాడు. పేటేంట్ హక్కు పొందాడు. ఎందరో ఆడవాళ్ళ బతుకు కష్టాలను తీర్చాడు.
2018 ఫిబ్రవరి 27న జాతీయ సైన్స్ దినోత్సవ సంబూరాలలో చౌటుప్పల్ లోని చందన పాఠశాల యాజమాన్యం జెవివి నాయకులు అవ్వారు గోవర్ధన్, రామేశ్వరి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.  చింతకింది మల్లేశంని సన్మానించడం నిజంగా ఎంతో ఆనందదాయకం. మరుపురాని మధురానుభూతి.
చింతకింది మల్లేశం గారి బయోపిక్ మల్లేశం నేటి యువతకు ఆదర్శం. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)