మృగశిర కార్తె

Telugu Lo Computer
0

 

మృగశిర కార్తె నూతన ఉత్సాహాంతో.. వేసవి తాపాన్ని తగ్గిస్తూ, తొలకరి వర్షాలతో మొదలవుతుంది. మృగశిరలో ముసలి ఎద్దు కూడా రంకె వేస్తుందని, ఈ కాలంలో కురిసే వర్షాలు మూడు లోకాలను చల్లబరుస్తాయని, ముంగిళ్ళు చల్లబడతాయని, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పెద్దలు మృగశిరపై ప్రత్యేకంగా చెబుతుంటారు.ఎందుకంటే మృగశిర కార్తె ( జూన్ కాలానికి) ముందు రెండు నెలలు విపరీతమైన ఎండలతో భూమి బాగా కాగి ఆ సూక్ష్మ జీవులు చనిపోయి ఉంటాయి. అలాంటి సమయాన్ని దాటి వర్షాలు పడిన తర్వాత మనకి 13 రోజుల కాలవ్యవధి ఉంటుంది.ఆ సమయంలోనే మృగశిర కార్తెలో భాగంగా అందరూ భూమిని దున్నడం మొదలుపెడతారు
*మృగశిర కార్తెలో భూమిని ఎందుకు దున్నుకోవాలి.*
భూమిని దున్నుకోవటానికి రెండు ప్రధాన కారణాలు వున్నాయి.విత్తనాలు విత్తుకోవటం మరియు ఇలా దున్నకోవటం వల్ల భూమిలోని ఉష్ణవాయువులన్ని బయటకు వెళ్ళిపోయి భూమి చల్లబరిచే అవకాశముంటుంది.
దీని వల్ల విత్తనం మొలకెత్తడానికి కావలసిన ప్రతికూల వాతావరణాన్ని కల్పించినవారమవుతాం.
*దిశలను ఎలా మార్చుకుంటుంది..*
ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి 13 రోజులకు ఓ సారీ తన కక్ష్యలను మార్చుకుంటుంది.ఏప్రిల్ నెలలో భూమి దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నప్పుడు సూర్యునికి దగ్గరగా వెళుతుంది. ఇలా కక్ష్యలో ప్రయాణిస్తూ 13 రోజులకు ఓ సారి నక్షత్రాన్ని మార్చుకుంటూ వెళుతూ అలా రెండున్నర నెలల కాలానికి భూమి సూర్యుని నుంచి కొంత దూరంగా వెళ్లిపోతుంది. అంటే భూమి ఒక్కో నక్షత్రం దాటడానికి 13 డిగ్రీల 20 పాయింట్లు అవధి పడుతుందన్న మాట. ఈ రెండున్నర నెలల కాలంలో సూర్యుని నుంచి 55 డిగ్రీల పాయింట్లు దూరంలో భూమి వెళుతుంది. అప్పటికి సూర్యుని యొక్క కిరణాల శక్తి భూమి మీద తగ్గుతూ కిరణాలు వంకరగా పడటం వల్ల భూమి వాతావరణంలో కక్ష్యలో చల్లబడి మనకు వర్షాలు మొదలవుతాయి. దీనితో భూమిలో విత్తనం మొలకెత్తడానికి అనువుగా ఉష్ణోగ్రత 25-35 డిగ్రీలు ఉంటుంది.
*మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత*
భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోడ్లన్ని ఎండిపోయి పగుళ్ళతో దుమ్ము లేస్తుంది. ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు అని అర్ధం. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలుపెడతారు.
*పురాణాలు ఏం చెబుతున్నాయి..*
వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తును బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. ఈ కార్తె ప్రాధాన్యత మనకు భగవద్గీతలోనూ కనిపిస్తుంది. తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉధ్భవిస్తూ వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ సమయంలో వాతావరణ ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ఓజస్సు , తేజస్సు మృగశిర కార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే ప్రాచీన వైద్యుడు తన గ్రంథాల్లో వివరించాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోజున ఆధ్యాత్మిక చింతనతో గడిపి భగవంతుడి ఆశీర్వాదాలు పొందగలరు.

*మృగశిర గురుంచి సామెతలు*
మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును
మృగశిర కురిస్తే ముసలి ఎద్దు రంకె వేయును
మృగశిర కు ముల్లోకాలు చల్లబడును
మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి
మృగశిరలో పెట్టిన పైరు మీసకట్టున కొడుకు మేలు
మృగశిర వర్షిస్తే మగ గర్జిస్తుంది
మృగశిర కురిస్తే ముంగాలి పండును
మృగశిర చిందిస్తే ఐదు కార్తెలు వర్షించును

Post a Comment

0Comments

Post a Comment (0)