వైద్య సిబ్బందికి తాజ్ ధాతృతం

Telugu Lo Computer
0


కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవి. ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందిస్తూ ఇంటిని కూడా మరిచిపోతున్న వారెందరో.  అలాంటి వారికి భోజనాలు అందిస్తున్నాయి.   తాజ్ హోటల్స్‌కు కస్తుర్బా ఆసుప్రతికి చెందిన డాక్టర్ చంద్రకాంత్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వైద్య సిబ్బంది ఎనలేని సేవలు అందిస్తున్నారని అలాంటి వారికి పౌష్టికాహారాన్ని అందించిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్‌కు ధన్యవాదాలు అన్నారు. గత రెండు నెలలుగా సుమారు 10 లక్షల మందికి తాజ్ హోటల్స్ భోజన సదుపాయం కల్పించాయి. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్‌ నేతృత్వంలోని తాజ్ హోటల్స్ ఈ సేవా కార్యక్రమానికి పూనుకున్నాయి. 'తాజ్ పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ ట్రస్ట్' ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆ సంస్థ తన తాజా ప్రకటనలో తెలిపింది. 10 రాష్ట్రాల్లోని 12 నగరాల్లో భోజనాలు పంపిణీ చేశామని సంస్థ ఉపాధ్యక్షుడు గౌరవ్ పోఖ్రియల్ తెలిపారు. కాగా, గతేడాది ఫస్ట్ వేవ్ సందర్భంగా 30 లక్షల భోజనాలు పంపిణీ చేసి తన ఔన్నత్యాన్ని చాటుకుంది తాజ్ హోటల్స్ గ్రూప్.




Tags

Post a Comment

0Comments

Post a Comment (0)