"కచ్చడం" అంటే...!

Telugu Lo Computer
0


స్త్రీలు పరపురుషులతో లైంగిక కార్యకలాపములు జరపకుండా మగవారు తమ సొంత స్త్రీలకు బిగించే ఓ లోహ సాధనం.

మధ్య యుగాల్లో దీని వాడకం చాలా ఎక్కువగా ఉండేది. ఎంత ఎక్కువంటే, కచ్చడం లేని స్త్రీ మర్యాదస్తురాలు కాదు (పతివ్రతకాదు) అనేంత.
దూరప్రాంతాలకు, లేదా ఇల్లు దాటి బయటకు వెళ్లే (అనుమానపు) పురుషులు వారు తిరిగొచ్చే లోపు భార్య శీలవతిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కచ్చడాలు బింగించి తాళం వేసుకుని, నిశ్చింతగా వెళ్లి వచ్చే వారు.
పేదలు, మిడిల్ క్లాసు వాళ్ళు ఇనుప, ఇత్తడి కచ్చడాలు వాడితే, ధనవంతులు వెండి బంగారు కచ్చడాలు వాడేవారు.
ఈ పద్ధతి మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉంది.
ఇప్పుడు వాడుకలో మన స్త్రీలు వాడుతున్న వడ్డాణం, చిన్నపిల్లలకు మొలకు కట్టే సిగ్గుబిళ్ళ ( మారుగుబిళ్ళ) కూడా ఈ కచ్చడాల అవశేషాలే.
ఇలాంటి ఎన్నో విషయాలు సేకరించి "తాపీ ధర్మారావు" (తాతాజీ )అనే పరిశోధకుడు 1940 లో రాసిన "ఇనుప కచ్చడాలు" అనే పుస్తకం చదవండి.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)