తుపాకీతో యువకుడు వీరంగం

Telugu Lo Computer
0

  


పక్కింటి యువతిని చాన్ బాషా ఫోన్ నెంబర్ అడిగాడు. ఆ యువతి భయంతో ఈ విషయాన్ని ఇంట్లో వారికి తెలిపింది. దీంతో యువతి తల్లిదండ్రులు గ్రామపెద్దలకు ఫిర్యాదు చేయగా.. వారు చాన్ బాషాను కొట్టి మందలించారు. ఈ ఘటన  బైరెడ్డిపల్లి మండలం కడపనతం గ్రామంలో  జరిగింది. 

యువతి ఇంటి ముందు చాన్ బాషా నాటు తుపాకితో రెచ్చిపోయాడు. ఇంట్లో వారు ప్రశ్నించడంతో తుపాకితో కాల్పులు జరిపాడు. బుల్లెట్ మిస్ అయ్యి పక్కింటి తలుపులు ధ్వంసం అయ్యాయి. యువతి కుటుంబ సభ్యులు భయంతో రాత్రంతా ఇంట్లోనే ఉండి ఉదయం పోలీసులను ఆశ్రయించారు. కాల్పులకు పాల్పడ్డ యువకుడిని  బైరెడ్డిపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)