టీవీఎస్ స్కూటర్ ధర తగ్గింపు!

Telugu Lo Computer
0



ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన వాహన శ్రేణిలోని ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. తాజాగా ఫేమ్‌-2 (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India Phase II) సబ్సిడీని కేంద్రం సవరించింది. ఇందులో భాగంగా ఐక్యూబ్‌పై రూ.11,250 తగ్గిస్తున్నట్లు టీవీఎస్‌ ప్రకటించింది. ప్రస్తుతం దీని ధర ₹.1,12,027 ఉండగా, సవరించిన ధరతో ₹.1,00,777లకే లభించనుంది.


ఇక ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే, ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే, ఎకో మోడ్‌లో 75 కి.మీ. ప్రయాణించవచ్చు. గంటకు 78కి.మీ. టాప్‌ స్పీడ్‌ను ఐక్యూబ్‌ అందుకోగలదు. ఇందులో 3Li-ion బ్యాటరీ అమర్చారు. 5గంటల్లో 80శాతం ఛార్జ్‌ అయ్యేలా దీన్ని డిజైన్‌ చేశారు. పూర్తి ఛార్జ్‌ చేయడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. మూడేళ్లు లేదా 50వేల కి.మీ. వరకూ బ్యాటరీపై వారెంటీ ఉంటుంది.


ఇటీవల ఫేమ్‌-2 పథకంలో కేంద్రం కొన్ని సవరణలు చేసింది. ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులకు ప్రస్తుతం 1KWhకు ₹10వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీని ₹15 వేలకు పెంచుతున్నట్లు కేంద్రం 



పేర్కొంది. వాహనం ఖరీదులో గరిష్ఠంగా 40 శాతం వరకూ ఈ ప్రోత్సాహకాలను అందించనున్నారు. గతంలో ఇది 20 శాతం మాత్రమే ఉండేది.


Post a Comment

0Comments

Post a Comment (0)