వ్యాక్సిన్‌కు ముందు.. తర్వాత....

Telugu Lo Computer
0


నీళ్లు ఎంత తాగితే అంత మంచిది

కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తర్వాత నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. నీటిని ఎక్కువగా తాగడంతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినడం వల్ల శరీరంలోని నీటి స్థాయిలు పెరుగుతాయి. అలా నీరసం తగ్గి ఎనర్జీ రీ క్రియేట్ అవడంతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది.

ఆల్కహాల్ తీసుకోవద్దు

ఆల్కహాల్ సేవించే వారు టీకా తీసుకోవడానికి కొన్ని వారాల ముందు నుంచి, తీసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు మందు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే టీకా తీసుకున్న తర్వాత శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

ప్రాసెస్‌డ్ ఫుడ్ వద్దు

ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటే.. అందులో ఉండే అధిక క్యాలరీలు, సంతృప్త కొవ్వులు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌ను తట్టుకునే శక్తి క్షీణిస్తుంది. అందుకే ప్రాసెస్‌డ్ ఫుడ్ బదులు అధిక ఫైబర్ ఉండే గోధుమలను ఆహారంగా తీసుకోవడం మంచిది.

షుగర్ ఫుడ్స్ తీసుకోవద్దు 

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత విశ్రాంతి చాలా అవసరం. ఎంత ఎక్కువ నిద్రపోతే అంత చురుగ్గా ఉంటాం. కాబట్టి ఈ సమయంలో సంతృప్త కొవ్వులు, చక్కెరస్థాయులు ఎక్కువ ఉన్న ఆహారాన్ని దూరం పెట్టాలి.

బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి

చాలామందిలో అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సైడ్ ఎఫెక్ట్ ల నుంచి బయట పడాలంటే శరీరానికి శక్తినిచ్చే, రోగ నిరోధక శక్తిని పెంచే సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. ప్రాసెస్‌డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)