పుట్టినరోజు వేడుకలలో కాల్ గర్ల్స్

Telugu Lo Computer
0

గుంటూరు నగరంలోని అరండల్ పేటలో ఓ హోటల్ నందు  నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కాల్ గర్ల్స్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో హోటల్ పై దాడి  చేసి అరెస్టు చేశారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకువచ్చినట్లు గుర్తించారు.

ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను, ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను పునరావస కేంద్రానికి తరలించారు. రేవ్ పార్టీ ఏమైనా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ  అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)