ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telugu Lo Computer
0


ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 40 జారీ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ వార్డుల్లో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ. 4 వేలు వసూలు చేయాలని,  ఐసీయూ గదికి  రూ. 7,500 గా, . వెంటిలేటర్ పై ఐసీయూలో చికిత్స చేస్తే రోజుకు రూ. గరిష్టంగా రూ. 9 వేలే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పీపీఈ కిట్ ధర రూ. 273 కంటే ఎక్కువ వసూలు చేయవరాదని ప్రభుత్వం చెప్పింది. సాధారణ అంబులెన్స్ కు కిలోమీటరుకు రూ.75 గా, లేటెస్ట్ అంబులెన్స్ కు కిలోమీటరుకు రూ. 125 వసూలు చేయాలని ప్రభుత్వం ఈ జీవోలో తెలిపింది. 

నిర్ణయించిన ధరలు

సాధారణ అంబులెన్సుకు కనీస చార్జీ రూ.2 వేలు

హెచ్ఆర్సీటీ-రూ.1,995

డిజిటల్ ఎక్స్‌రే- రూ.1,300

డీ డైమర్ పరీక్ష-రూ.300

సీఆర్పీ-రూ.500

ప్రొకాల్ సిటోనిన్-రూ.1,400

ఫెరిటిన్-రూ.400

ఎల్డీహెచ్‌-రూ.140

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)