అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చింది ?

Telugu Lo Computer
0

 


" తిరుమల " కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి  దర్శనము కి వెళ్ళాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న " అలిపిరి " ప్రాంతానికి చేరుకోవాలి. 

అసలు " అలిపిరి " అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా ... ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ " అలిపిరి " అనే పదం లేదు. 

అయితే, " అలిపిరి " అనే ఈ పదం ఎలా పుట్టింది ... ? దీని వెనుక చరిత్ర ఏమిటి ?

పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం," తిరుపతి " నగరం ఇప్పటిలాగా లేదు.

ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం.ఆ సమయంలో హిందువులను, హిందూసానుభూతిపరులను, సాధువులను చాలా దారుణంగా హింసించారు. 

ఈ నిజాం నవాబు, ఢిల్లీ సుల్తానుకు - కప్పం కడుతూ సామంతుడిగా పడి ఉంటూ, హిందువులపై నిరాఘాటంగా అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు.

పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా (ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా - కుతుబ్ షా మరియు వజీర్ల సైన్యం, " ఆలీ " అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత " ఆలీ " సైన్యం తిరుపతికి చేరుకుంది. అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం. ఇప్పుడు " మంచినీళ్ళ కుంట " అని చెప్పుకుంటున్న " నరసింహ తీర్థమే " అప్పటి తిరుపతి గ్రామం. 

ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని " నరసింహ తీర్థం రోడ్ " అనే పిలుస్తారు. ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించాడు. శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని ఆలోచన.  ఎవరి ప్రమేయమూ లేకుండా అతని  దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు.అప్పుడు  శ్రీ స్వామి వారిని ఆలీ బిగ్గరగా రోదిస్తూ క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్నాడు. అప్పుడు దయార్ద్రచిత్తుడయిన స్వామి వారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు "ఆలీ". ఉర్దూ లేక హిందీ భాషలో " ఫిర్ నా " అంటే వెనక్కి మళ్ళడం, " ఫిరే అంటే  వెళ్లడం అలీ వెను దిరిగడం వల్ల అలి ఫీరి,  ఆలీ పిరి అని చెప్పుకున్నారు" ఆలీ " ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు. ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు " అలీ ఫిరే" ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు.  కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం - ఆలి పిరే గా రూపాంతరం చెంది ఇప్పుడు " అలిపిరి గా స్థిరపడింది. 


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)