అందుబాటులోకి 24 స్పెషల్ ట్రైన్స్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 24 June 2021

అందుబాటులోకి 24 స్పెషల్ ట్రైన్స్


జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తున్న నేపథ్యంలో  ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఈ రైళ్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

వివరాలు:

Train No 02831: విశాఖపట్నం నుంచి లింగంపల్లి ట్రైన్(డైలీ) జులై 01 నుంచి అందుబాటులోకి రానుంది.

Train No 2832: లింగంపల్లి-విశాఖపట్నం ట్రైన్(డైలీ) జులై 02 నుంచి అందుబాటులోకి రానుంది. Train No 07488: విశాఖ-కడప మధ్య నడిచే ట్రైన్(డైలీ) జులై 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.

Train No 07487: కడప-విశాఖ మధ్య నడిచే ఈ ట్రైన్ జులై 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.

Train No 08479: భువనేశ్వర్ నుంచి తిరుపతి మధ్య ప్రతీ శనివారం నడిచే ఈ వీక్లీ ట్రైన్ జులై 3 నుంచి అందుబాటులోకి రానుంది.

Train No 08480: తిరుపతి-భువనేశ్వర్ మధ్య ప్రతీ ఆదివారం నడిచే ఈ స్పెషల్ ట్రైన్ జులై 04 నుంచి అందుబాటులోకి రానుంది.

Train No 02851: విశాఖపట్నం-హెచ్.నిజాముద్దీన్ మధ్య వారానికి రెండు సార్లు(సోమవారం, శుక్రవారం) నడిచే ఈ ట్రైన్ జులై 2 నుంచి అందుబాటులోకి రానుంది.

Train No 02852: హెచ్.నిజాముద్దీన్-విశాఖపట్నం మధ్య వారానికి రెండు సార్లు(బుధవారం, ఆదివారం) నడిచే ట్రైన్ జులై 4 నుంచి నడపనున్నారు.

Train No 02869: విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ మధ్య వారానికి ఒక సారి(సోమ) నడిచే ట్రైన్ జులై 5 నుంచి అందుబాటులోకి రానుంది.

Train No 02870: చెన్నై సెంట్రల్-విశాఖపట్నం మధ్య వారానికి ఒక సారి(మంగళవారం) నడిచే ట్రైన్ ఈ జులై 6 నుంచి అందుబాటులోకి రానుంది.

No comments:

Post a Comment

Post Top Ad